రియా చక్రవర్తి ఇంట్లో యాంటీ డ్రగ్ అధికారుల సోదాలు

రియా చక్రవర్తి ఇంట్లో యాంటీ డ్రగ్ అధికారుల సోదాలు

సుశాంత్ సూసైడ్ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. కేసులో ప్రధాన నిందితురాలు, సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ అయిన రియా చక్రవర్తి ఇంట్లో నార్కోటిక్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ ఉదయం ముంబై… జుహు తారా రోడ్డులోని రియా చక్రవర్తి ఇంటికి నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు వెళ్లారు. రియాను అధికారులు ఆమె ఇంట్లోనే ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా.. రియా సోదరుడు షోవిక్, సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరండాల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. ఆ తర్వాత షోవిక్, శామ్యూల్‌లను యాంటీ డ్రగ్ ప్రోబ్ ఆఫీసుకు తీసుకెళ్లి ప్రశ్నిస్తోంది. అయితే అధికారులు మాత్రం దర్యాప్తులో భాగంగానే వీరి ఇళ్లకు వచ్చినట్లు తెలిపారు.

సుశాంత్ సూసైడ్ మిస్టరీ కేసును సీబీఐ, ఈడీ, నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి. సుశాంత్ సహా అతడి సన్నిహితుల ప్రైవేట్ వాట్సప్ గ్రూప్‌లోని మెసేజ్‌ల ఆధారంగా డ్రగ్ ట్రాఫికింగ్ పై కీలక వివరాలు తెలుసుకున్నారు. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్, గౌరవ్ ఆర్యా, జయ సాహా, సుశాంత్ కో మేనేజర్ శ్రుతి మోడీలపై నార్కొటిక్ అధికారులు కేసులు పెట్టారు. డ్రగ్ పెడ్లర్లు అబ్దుల్ బాసిత్, కైజాన్ ఇబ్రహీంలు ఇటీవల అరెస్ట్ కావడం.. వారి విచారణలో రియా చక్రవర్తి, శామ్యూల్ మిరండా పేర్లు బయటకు రావడంతో.. నార్కొటిక్ అధికారులు రంగంలోకి దిగారు. దాంతో శుక్రవారం ఉదయాన్నే రియా, షోవిక్, శామ్యూల్ ఇళ్లకు వెళ్లి ప్రశ్నించారు.

For More News..

తెలంగాణలో మరో 2,478 కరోనా కేసులు

బోల్తా పడి నుజ్జునుజ్జయిన కారు.. స్పాట్‌లోనే అయిదుగురు మృతి

బ్యాడ్ బాయ్స్​కి ఫాలోయింగ్ ఎక్కువ!