
లక్నో: పహెల్గాం దాడి తర్వాత రంగంలోకి దిగిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ దర్యాప్తును ముమ్మరం చేసింది. దేశంలో ఉంటూ ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిని గుర్తించే పనిలో నిమగ్నమైంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ చేసినట్లు ఎస్టీఎఫ్ ప్రకటించింది. యూపీలోని రాంపుర్‌కు చెందిన వ్యాపారవేత్త షాజాద్ పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తరఫున సరిహద్దుల్లో అక్రమ రవాణా, గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించామని తెలిపింది.
🚨 Busted! UP ATS has arrested Shahzad, an ISI spy operating from Rampur, UP. Under the cover of smuggling goods like cosmetics and spices from Pakistan, he was leaking sensitive security information to Pakistan’s intelligence agency.
— भँ० अजीत सिंह तोमर (@Bhanwar_Ast) May 19, 2025
His frequent visits to Pakistan and deep… pic.twitter.com/dD35P7cXM7
ఐఎస్‌ఐతో సంబంధాలు కొనసాగిస్తూ.. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని ఎస్టీఎఫ్ అధికారులు పేర్కొన్నారు. గూఢచర్యం సమాచారాన్ని పంచుకునేందుకు అతడు పలుమార్లు పాక్ వెళ్లొచ్చాడని, పాక్‌కు సౌందర్య సాధనాలు, దుస్తులు, సుగంధ ద్రవ్యాలు ఇతర వస్తువుల రవాణా ముసుగులో ఈ చర్యలకు పాల్పడేవాడని అన్నారు. షాజాద్ భారత్‌లో పలు సిమ్‌కార్డ్‌లను కొనుగోలు చేసి దేశంలో ఉన్న ఐఎస్‌ఐ ఏజెంట్లకు అందించేవాడన్నారు. యూపీలోని పలువురుని ఉగ్రవాదం వైపు ప్రోత్సహించినట్టు చెప్పారు.