సెకండ్ డోస్ ఆలస్యంగా ఇస్తే భారీగా యాంటీబాడీల ఉత్పత్తి

సెకండ్ డోస్ ఆలస్యంగా ఇస్తే భారీగా యాంటీబాడీల ఉత్పత్తి

న్యూఢిల్లీ: వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చిన తర్వాత సెకండ్ డోస్ ను ఆలస్యంగా ఇస్తే యాంటీ బాడీస్ భారీగా పెరుగుతాయని ఓ స్టడీలో తేలింది. శరీరంలో యాంటీ బాడీస్ తయారు చేసి, పరిపక్వత చెందేందుకు ఫస్ట్ డోస్ తర్వాత ఎక్కువ గ్యాప్ ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల రెండో డోస్ ఇచ్చే ముందు మన దేహంలో 20 నుంచి 300 శాతం అధికంగా యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయని కొత్త పరిశోధనలో తేలింది. డోసుల మధ్య అంతరంతో అన్ని వ్యాక్సిన్ లు మంచి ప్రభావం చూపిస్తున్నాయని సమాచారం. కాగా, భారత్ లో కరోనా నుంచి కోలుకున్న వారికి ఇచ్చే వ్యాక్సిన్ ఒక డోసుకు మరో డోసుకు మధ్య 90 రోజుల వ్యవధిని నిర్ణయించారు. అదే విదేశాల్లో ఎక్కువగా వినియోగిస్తున్న ఆస్ట్రా జెనెకా టీకాకు కుడా రెండు డోసుల మధ్య 12 వారాల అంతరం ఉండటం గమనార్హం.