వ్యాక్సిన్​తో ఫుల్ గా యాంటిబాడీస్

వ్యాక్సిన్​తో ఫుల్ గా యాంటిబాడీస్

ఐదు నుంచి పది రెట్లు పెరుగుతున్నయంటున్న డాక్టర్లు
కరోనా వచ్చి తగ్గినవాళ్లలో మరింత ఎక్కువగా డెవలప్​ అయితున్నయ్​

హైదరాబాద్‌‌, వెలుగు: కరోనా వ్యాక్సిన్​తో మంచి రిజల్ట్స్​ కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లలో కరోనా వైరస్​ను ఎదుర్కునే యాంటిబాడీస్‌‌ బాగా డెవలప్‌‌ అవుతున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,81,179 మంది వ్యాక్సిన్ వేయించుకోగా.. అందులో హెల్త్ కేర్ వర్కర్లు 1.93 లక్షల మంది ఉన్నారు. వీరిలో చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందు, తర్వాత యాంటిబాడీ టెస్టులు చేయించుకున్నారు. వీరిలో ఎక్కువ మందికి ఫస్ట్ డోసుతోనే ఐదు నుంచి పది రెట్ల వరకు యాంటిబాడీస్‌‌  పెరిగాయని డాక్టర్లు చెప్తున్నారు. ఇంతవరకు కరోనా వైరస్ బారిన పడనివారికంటే.. వైరస్ సోకి కోలుకున్నవారిలో మరింత ఎక్కువగా యాంటిబాడీస్ ఉత్పత్తి అవుతున్నట్టు డాక్టర్లు గుర్తించారు. వ్యాక్సిన్ వేయించుకున్నవాళ్లలో యాంటిబాడీస్ ఎంత మేర ఉత్పత్తి అవుతున్నయో తెలుసుకునేందుకు హెల్త్
డిపార్ట్‌‌మెంట్ కూడా ఇంటర్నల్‌‌గా ఓ స్టడీ చేయిస్తోంది. ప్రస్తుతం హెల్త్ కేర్ వర్కర్లకు సెకండ్ డోసు వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. మరో వారం రోజుల్లో ఇది పూర్తి కానుంది. తర్వాత పది, పదిహేను రోజుల్లో యాంటిబాడీస్‌‌ స్టడీ రిపోర్ట్‌‌ను వెల్లడించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కరోనా వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌పై హెల్త్ కేర్, ఫ్రంట్‌‌‌‌‌‌‌‌లైన్ వర్కర్లలో భయం వీడటం లేదు. ఫస్ట్ డోసు వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ను హెల్త్ కేర్ వర్కర్లలో 58 శాతం మంది తీసుకోగా, ఫ్రంట్‌‌‌‌‌‌‌‌లైన్ వర్కర్లలో 34 శాతం మంది మాత్రమే తీసుకున్నారు. సెకండ్ డోసుకు వచ్చేసరికి ఇది మరింత తగ్గింది. షెడ్యూల్ ప్రకారం శనివారం నాటికి లక్షా 20 వేల 480 మంది హెల్త్ కేర్ వర్కర్లు సెకండ్ డోసు వేసుకోవాల్సి ఉండగా.. 92,632 మంది మాత్రమే తీసుకున్నారు. మరో 27,848 వేల మంది సెకండ్ డోసు వేయించుకోలేదు. ఫస్ట్ డోసు నాటి కంటే.. సెకండ్ డోసు తర్వాత ఎక్కువ మందిలో బాడీ పెయిన్స్, జ్వరం వంటి రియాక్షన్స్ రావడంతో వ్యాక్సిన్ తీసుకోవడానికి జంకుతున్నారు. అలాగే, ఇప్పటికే కరోనా వచ్చి తగ్గిపోయినవాళ్లు సింగిల్ డోసు తీసుకుంటే సరిపోతుందన్న ప్రచారంతో కిందిస్థాయి సిబ్బంది గందరగోళానికి గురవుతున్నారు. ఇలాంటి వాటిపై హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ నుంచి స్పందన లేకపోవడంతో, ఎటూ తేల్చుకోలేక వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉంటున్నారు. డాక్టర్లు, నర్సులు మాత్రం వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఎక్కువ మంది ముందుకొస్తున్నారు. అవగాహన కల్పిస్తే మిగతావారు కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకొచ్చే చాన్స్ ఉంది.

టెన్  టైమ్స్ పెరిగినయి

నాకు ఫస్ట్ డోసు వ్యాక్సిన్ తోనే యాంటిబాడీస్‌‌‌‌‌‌‌‌ టెన్ టైమ్స్ ఇంక్రీజ్ అయినయి. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ డోసుకి ఒక్క రోజు ముందు యాంటిబాడీస్ టెస్ట్ చేయిస్తే 2.34
యూనిట్స్ వచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న ఐదు వారాల తర్వాత చేయిస్తే.. 20 యూనిట్స్‌‌‌‌‌‌‌‌ కంటే ఎక్కువగా ఉన్నట్టు వచ్చింది. మరో డాక్టర్‌ కు కూడా ఇలాగే పెరిగాయి. సెకండ్ డోసు తర్వాత ఎలా ఉంటుందో చూడాలి.                             – డాక్టర్ కిరణ్ మాదాల, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌