కమల్‌కు ముందస్తు బెయిల్‌

కమల్‌కు ముందస్తు బెయిల్‌

నాథూరాం గాడ్సేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం చీఫ్‌ కమల్‌ హాసన్‌కు ముందస్తు బెయిల్‌ లభించింది. మద్రాస్‌ హైకోర్టు మధురై ధర్మాసనం దీనికి సంబంధించి ఇవాళ( సోమవారం) తీర్పునిచ్చింది. స్వతంత్ర భారత దేశంలో తొలి తీవ్రవాది హిందువేనంటూ కమల్‌ హాసన్‌ వ్యాఖ్యానించడంపై  ది హిందూ మున్నాని అనే సంస్థ అరవకురిచి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మతపరమైన వ్యాఖ్యలతో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు..ఉద్ధేశపూర్వకంగా భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారంటూ.. ఆయనపై 153ఏ, 295ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం కమల్‌ హాసన్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు.