
పవన్ కళ్యాణ్(Pawan kalyan), అల్లు అర్జున్(Allu Arjun), అల్లు శిరీష్(Allu Shirish) వంటి మెగా హీరోల సరసన నటించినా అను ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel)కి తగిన గుర్తింపు రాలేదు. దీంతో కోలీవుడ్‌పై ఈ భామ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే, అక్కడ మాత్రం ఈ బ్యూటీకి బాగానే వర్కవుట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇటీవల కార్తి(Karthi)తో ‘జపాన్(Japan) వంటి క్రేజీ సినిమాలో అను నటించింది. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఈ హీరోయిన్ మరో బంపర్ ఆఫర్ పట్టేసింది.
జపాన్ తర్వాత కార్తి నటించనున్న మరో ప్రాజెక్ట్‌లో సైతం ఫీమేల్ లీడ్‌గా ఎంపికైనట్టు తెలుస్తోంది. దీని వెనుక కార్తి రికమెండేషన్ ఉందనే టాక్ నడుస్తోంది. అను ట్యాలెంట్‌ను గుర్తించి దర్శకనిర్మాతలకు ఆమె పేరును సజెస్ట్ చేశాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక దీపావళి సందర్భంగా జపాన్ విడుదలకు రెడీ అవుతోంది.