జపాన్‌‌లో సర్‌‌‌‌ప్రైజ్ చేస్తా : అను ఇమ్మాన్యుయేల్

జపాన్‌‌లో సర్‌‌‌‌ప్రైజ్ చేస్తా : అను ఇమ్మాన్యుయేల్

గ్లామర్ రోల్స్‌‌తో ఆకట్టుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును అందుకుంది అను ఇమ్మాన్యుయేల్. కార్తికి జోడీగా ఆమె నటించిన చిత్రం ‘జపాన్’. రాజు మురుగన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అను ఇమ్మాన్యుయేల్ చెప్పిన విశేషాలు. 

‘‘రాజు మురుగన్ చాలా వైవిధ్యమైన దర్శకుడు. తన ప్రతి సినిమా డిఫరెంట్‌‌గా ఉంటుంది. జపాన్ కథ కూడా యూనిక్‌‌గా ఉంటుంది. ఇలాంటి సినిమాని చూడటానికి ఆడియెన్‌‌గా కూడా చాలా ఆసక్తి చూపిస్తాను.  కార్తి వండర్‌‌‌‌ఫుల్ యాక్టర్.   ఏదైనా సన్నివేశం చేసే ముందు చర్చించుకునే వాళ్ళం. ఆఫ్ స్క్రీన్ కార్తి గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఇది ఆయన 25వ చిత్రం. తనతో వర్క్ చేయడం గౌరవంగా భావిస్తున్నా. ఇందులో నా పాత్ర సర్‌‌‌‌ప్రైజ్ చేసేలా ఉంటుంది. కార్తి, నా పాత్రకు మధ్య చాలా ఆసక్తికరమైన ట్రాక్ ఉంటుంది. అది చాలా క్రేజీగా ఉంటుంది.

సునీల్‌‌ గారితోనూ నాకు సీన్స్ ఉన్నాయి. ఆయన పాత్ర అందర్ని ఆకట్టుకుంటుంది. ఇందులోని ప్రతి పాత్ర డిఫరెంట్‌‌గా ఉంటుంది.   జీవీ ప్రకాష్ కథకు తగ్గట్టు చక్కటి మ్యూజిక్ అందించారు. ఎస్ఆర్ ప్రభు గారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. కేరళ, కాశ్మీర్, చెన్నై సహా చాలా అద్భుతమైన లొకేషన్స్‌‌లో షూట్ చేశాం. బెస్ట్ టీమ్‌‌తో చేసిన ఈ సినిమా ప్రేక్షకులకు గొప్ప  ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను ఇస్తుంది’’.