"టైగర్ నాగేశ్వరరావు" లో అనుపమ్ ఖేర్ కీ రోల్

"టైగర్ నాగేశ్వరరావు" లో  అనుపమ్ ఖేర్ కీ రోల్

మాస్ మహారాజ్ రవితేజ పాన్ ఇండియా మూవీతో రాబోతున్నాడు. స్టువర్టుపురం గజదొంగ జీవితకథ ఆధారంగ తెరకెక్కుతున్న  ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వంశీ దర్శకత్వం వహిస్తున్న  టైగర్ నాగేశ్వరరావు మూవీలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు.  టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్ లో అనుపమ్ ఖేర్ జాయిన్ అయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన స్టిల్ను విడుదల చేసింది. 

అనుపమ్ ఖేర్ ..బాలీవుడ్ సీనియర్ నటులు. హిందీ తెరపై  నటుడిగా తనదైన వేశారు. రీసెంట్గా  ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో ఆకట్టుకున్నారు.  అనుపమ్ ఖేర్ గతంలో టాలీవుడ్ లో నటించారు. తెలుగులో వెంకటేష్, అర్జున్, రాజేంద్ర ప్రసాద్ హీరోలుగా నటించిన ‘త్రిమూర్తులు’ మూవీలో యాక్ట్ చేశారు. 30 ఏళ్ల తర్వాత నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కార్తికేయ 2’ సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఇపుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు మూవీ పాన్ ఇండియా మూవీ కావడంతో పాటు...అనుపమ్ ఖేర్ కూడా కీ రోల్ ప్లే చేస్తుండటంతో..మూవీపై అంచనాలు నెలకొన్నాయి. 

రవితేజ విషయానికి వస్తే ఇటీవలే రామారావు ఆన్ డ్యూటీతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.  ప్రస్తుతం ‘ధమాకా’  సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ సినిమాతో పాటు చిరంజీవి, బాబీ సినిమాలో  రవితేజ నటిస్తున్నారు. వీటితో పాటు టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని అభిషేక్ అగర్వల్  ప్యాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు పాత్ర  విషయానికొస్తే.. రాబిన్ హుడ్ తరహా బందిపోటు దొంగ. తాను దోచుకున్న దాంట్లో పేదలకు సాయం చేస్తుండేవారు. అందుకే ఆయనకు ప్రజల్లో ఎంతో పేరుండేది. ఈయన్ని  ఆంగ్లేయులు ఉరి తీశారు. మరి టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ ఏ మేరకు అదరగొడతారనేది చూడాలి.

 ఈ సినిమా హీరోగా మాస్ మహారాజ్‌కు 71వ చిత్రం.  ప్రస్తుతం వరుస ఫ్లాపులతో  సతమతమవుతున్న రవితేజ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.