మొహం మీద చెప్పేస్తా.. అక్కడే వదిలేస్తా : అనుపమ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మొహం మీద చెప్పేస్తా.. అక్కడే వదిలేస్తా : అనుపమ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కేరళ బ్యూటీ అనుపమ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తన లైఫ్ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగా.. భావోద్వేగాలు ప్రదర్శించే విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటుంది అని యాంకర్ ప్రశ్నించింది. 

దానికి బదులుగా అనుపమ.. "ఎమోషన్స్ విషయంలో నేను చాలా నిజయితీగా ఉంటాను. నాకేదైనా నచ్చకపోతే అది మొహం మీదే చెప్పేస్తాను. ఆ విషయాన్ని కూడా అక్కడే వదిలేస్తాను. దానిగురించి ఆలోచింది మనసుపాడు చేసుకోవడం నాకు ఇష్టముండదు. ఎందుకంటే మన లైఫ్ చాలా చిన్నది. ఇక్కడ కొన్నాళ్లే ఉండేందుకు వచ్చాం.. మళ్లీ వెళ్లిపోతాం. బతికి ఉన్న కొద్ది రోజులైనా హ్యాపీగా ఉండాలి. సీసీ టీవీ పుటేజ్‌ ఆటోమెటిక్‌గా డిలీట్‌ అయినట్లు.. నా మైండ్ లోని చెత్తను కూడా డిలీట్ చేస్తుంటా.' అంటూ చెప్పుకొచ్చింది. 

ప్రస్తతం అనుపమ చేసిన ఈ కామెంట్స్ కు నెటిజన్స్ నుండి కూడా పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక అనుపమ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తతం ఆమె సిద్దు సిద్ధు జొన్నలగడ్డతో టిల్లు స్క్వేర్‌లో నటిస్తోంది. ఈ సినిమా తరువాత మాస్ మహారాజా రవితేజతో ఈగల్‌లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.