ఆగస్టులో అనుష్క సినిమా

ఆగస్టులో అనుష్క సినిమా

న‌‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి లీడ్‌‌ రోల్స్‌‌లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌‌‌‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌పై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. పి.మహేష్‌‌ బాబు దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో సోమవారం సినిమా రిలీజ్‌‌ డేట్‌‌ను అనౌన్స్ చేశారు. 

ఆగస్టు 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. చెఫ్‌‌ అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క నటిస్తుండగా, స్టాండప్‌‌ కమెడియన్‌‌ సిద్ధు పొలిశెట్టిగా నవీన్ నటిస్తున్నాడు. ‘భాగమతి’ తర్వాత యూవీ క్రియేషన్స్‌‌లో అనుష్క నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై పాజిటివ్ బ‌‌జ్ క్రియేట్ అయ్యింది.