మేనేజ్‌‌మెంట్ కోర్సుల్లో మరింత క్వాలిటీ : తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్

మేనేజ్‌‌మెంట్ కోర్సుల్లో మరింత క్వాలిటీ : తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్
  •     ఉన్నత విద్యామండలితో ఎంఓయూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మేనేజ్‌‌మెంట్ విద్యను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందడుగు వేసింది. మేనేజ్‌‌మెంట్ చదువుల్లో నాణ్యత, విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలను పెంచడమే లక్ష్యంగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌‌మెంట్ స్కూల్స్ (ఏఐఎంఎస్)తో మంగళవారం ఎంఓయూ కుదుర్చుకుంది. 

మంగళవారం హైదరాబాద్‌‌లోని టీజీసీహెచ్​ఈ ఆఫీసులో  చైర్మన్ బాలకిష్టారెడ్డి సమక్షంలో  కౌన్సిల్ సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్, ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ దుర్గ ప్రసాద్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థుల్లో ప్రత్యేక నైపుణ్యాలు అభివృద్ధి చెంది, వారు అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణమైన నిపుణులుగా ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.