మేడారం హుండీ ఆదాయం రూ.88 లక్షలు

మేడారం హుండీ ఆదాయం రూ.88 లక్షలు

తాడ్వాయి, వెలుగు: మేడారం వన దేవతలను దర్శించుకున్న భక్తులు సమర్పించిన 42 రోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. రూ.88,31,963 లక్షల ఆదాయం వచ్చినట్లు మేడారం జాతర ఈవో మేకల వీరస్వామి తెలిపారు. 

30 హుండీల్లోని కానుకలను మేడారంలోని భోజనశాలలో లెక్కించారు. సమ్మక్కకు రూ.39,74,504, సారలమ్మకు  రూ.36,22,256, పగిడిద్దరాజుకు రూ.3,44,088, గోవిందరాజుకు రూ.2,19368, ఈ హుండీ ద్వారా రూ.6,71,747 ఆదాయం వచ్చిందన్నారు. పూజారులు చందా గోపాల్ రావు, చందా రఘుపతిరావు, కాక కిరణ్, కాక వెంకటేశ్వర్లు, ఎండోమెంట్  సూపరింటెండెంట్  విజయ్ కుమార్, మేడారం ఎస్సై కమలాకర్  పాల్గొన్నారు.