‘కోర్ట్’ చిత్రంతో సక్సెస్ అందుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన మరో చిత్రం ‘బ్యాండ్ మేళం’. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన వెంకట్ నిర్మించారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించాడు. మార్చి 26న సినిమా రిలీజ్ కానుంది. సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు హీరో శ్రీవిష్ణు, రైటర్ విజయేంద్ర ప్రసాద్, డైరెక్టర్స్ వీవీ వినాయక్, బాబీ, నిర్మాతలు సురేష్ బాబు, బండ్ల గణేష్ అతిథులుగా హాజరై పాజిటివ్ వైబ్స్‌తో రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని అన్నారు.
తాము పోషించిన యాదగిరి, రాజమ్మ పాత్రలు అందరికీ నచ్చుతాయని రోషన్, శ్రీదేవి చెప్పారు. క్లైమాక్స్ చూసి అందరూ ఎమోషనల్ అవుతారని డైరెక్టర్ సతీష్ అన్నాడు. నిర్మాత, రైటర్ కోన వెంకట్ మాట్లాడుతూ ‘ఈ సినిమా నా కోసం చూడండి. నచ్చకపోతే ఇంకోసారి నేను రాసిన సినిమాని చూడకండి. ఫ్యూచర్‌లో రోషన్, శ్రీదేవిలను వెతుక్కుంటూ కథలు వస్తుంటాయి. ఈ మూవీ క్లైమాక్స్ అందరినీ కదిలిస్తుంది. ప్రేక్షకులకు జీవితాంతం గుర్తుంటుంది’ అని అన్నారు.
