
హైదరాబాద్, వెలుగు : ట్విన్ సిటీ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో హేమంత్ జిమ్నాస్టిక్స్ అకాడమీకి చెందిన అవిషి జైన్ మూడు గోల్డ్ మెడల్స్‌తో మెరిసింది. గచ్చిబౌలిలో మంగళవారం జరిగిన ఈ టోర్నమెంట్‌లో అండర్13 గర్ల్స్ కేటగిరీలో పోటీ పడ్డ అవిషి ఫ్లోర్, బ్యాలెన్స్ బీమ్, టేబుల్ వాల్ట్ లో టాప్ ప్లేస్‌తో గోల్డ్ మెడల్స్ సాధించింది. అండర్ 10 గర్ల్స్ కేటగిరీలో కావ్య గోల్డ్
సిల్వర్ గెలిచింది. ఈ టోర్నీలో హేమంత్ అకాడమీ జిమ్నాస్ట్‌లు తొమ్మిది గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు. మరో 22 సిల్వర్, 14 బ్రాంజ్ మెడల్స్‌తో టీమ్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచారు. మెడలిస్ట్‌లను చీఫ్ కోచ్ హేమంత్, కోచ్‌లు నగేశ్, కిశోర్, హర్షవర్దన్ అభినందించారు.