సిటీలో ఏ పనైనా ట్రాఫిక్​తో లింకై ఉంది : ఏసీపీ జి.శంకర్ రాజు

సిటీలో ఏ పనైనా ట్రాఫిక్​తో లింకై ఉంది : ఏసీపీ జి.శంకర్ రాజు

ముషీరాబాద్, వెలుగు: సిటీలో ఏ పనైనా ట్రాఫిక్​తో లింక్ అయి ఉందని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే అందరి పనులు చకచగా పూర్తవుతాయని బేగంపేటలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏసీపీ జి.శంకర్ రాజు తెలిపారు. శనివారం ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో బాగ్​లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జూనియర్ కాలేజీలో స్టూడెంట్లకు​ ట్రాఫిక్ రూల్స్​పై అవేర్​నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ.. వెహికల్స్ ​నడిపే ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా తెలిసి ఉండాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్, రాంగ్ రూట్, హెల్మెట్ లేకుండా ప్రయాణం అత్యంత ప్రమాదకరమన్నారు. మైనర్లకు వెహికల్స్ ఇవ్వొద్దని సూచించారు.  కార్యక్రమంలో ఎస్సై సుబ్బారావు, విద్యాసంస్థల అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డాక్టర్ రత్న, ప్రిన్సిపల్ వసుంధర, సిబ్బంది పాల్గొన్నారు.

పదో తరగతి స్టూడెంట్లతో ముఖాముఖి

కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్కూల్​ పదో తరగతి స్టూడెంట్లతో ఆల్ ఇండియా రేడియో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రధాని మోడీతో పరీక్షా పే చర్చ కార్యక్ర
మంలో చర్చించడంలో స్టూడెంట్లను సంసిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ఆలిండియా రేడియో ప్రతినిధి విజయలక్ష్మి, కో ఆర్డినేటర్ భిక్ష నాయక్ తెలిపారు.