స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల..అభ్యంతరాలకు జనవరి 5వ తేదీ వరకు సమయం : ఎంహెచ్ఎస్ఆర్బీ

స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల..అభ్యంతరాలకు జనవరి 5వ తేదీ వరకు సమయం : ఎంహెచ్ఎస్ఆర్బీ

హైదరాబాద్, వెలుగు: స్పీచ్ పాథాలజిస్ట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) మంగళవారం విడుదల చేసింది. అభ్యర్థులు అకడమిక్ క్వాలిఫికేషన్​లో సాధించిన 80%  మార్కులు, కాంట్రాక్ట్ సేవలకు ఇచ్చిన వెయిటేజీ మార్కులు 20%  ఆధారంగా ఈ లిస్టును రూపొందించి  (http://mhsrb.telangana.gov.in/) వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంచింది. 

అయితే, మల్టీ జోన్-–1  పరిధిలో ఎలాంటి పోస్టులు నోటిఫై చేయనందున, ఆ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు చెందిన అభ్యర్థులను సెలక్షన్ కోసం పరిగణనలోకి తీసుకోవడం లేదని బోర్డు స్పష్టం చేసింది. అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే జనవరి 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తెలపాలని బోర్డు సూచించింది.