హనుమకొండ సిటీ, వెలుగు: హనుమకొండ సుబేదారిలోని డీసీసీబీ ఆఫీస్ లో జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ బి.రవీందర్ సింగ్ అధ్యక్షతన మంగళవారం డిస్ట్రిక్ట్ లెవల్ టెక్నికల్ కమిటీ (డీఎల్టీసీ) మీటింగ్ నిర్వహించారు. ఇందులో 2026--27 సంవత్సరానికి గానూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్ణయించి, స్టేట్ లెవెల్ టెక్నికల్ కమిటీ (ఎస్ఎల్టీసీ)కి సిఫార్స్ చేయనున్నట్లు ఆఫీసర్లు తెలిపారు.
సమావేశంలో నాబార్డు డీడీఎం ఎల్.చంద్రశేఖర్, డీసీసీబీ సీఈవో ఎండీ వజీర్ సుల్తాన్, జీఎం ఉషశ్రీ, డీజీఎం అశోక్, ఏజీఎం మధు, జిల్లాలోని వివిధశాఖల అధికారులు, ఉమ్మడి జిల్లా రీజినల్ ఆఫీస్ బ్యాంక్ ఆఫీసర్లు, ప్రగతిశీల రైతులు తదితరులు పాల్గొన్నారు.
