నువ్వు నాకు నచ్చావ్‌‌‌‌‌‌‌‌ మళ్లీ వస్తోంది.. జనవరి 1న రీ రిలీజ్

నువ్వు నాకు నచ్చావ్‌‌‌‌‌‌‌‌ మళ్లీ వస్తోంది.. జనవరి 1న రీ రిలీజ్

వెంకటేష్ హీరోగా విజయ భాస్కర్ దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్‌‌‌‌‌‌‌‌’ చిత్రం విడుదలై పాతికేళ్లవుతోంది. త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ సక్సెస్ అందుకుంది.

జనవరి 1న ఈ చిత్రం రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా నిర్మాత రవికిషోర్, రచయిత త్రివిక్రమ్ ఆనాటి విశేషాలను గుర్తు చేసుకున్నారు. పాతికేళ్లు వెనక్కు వెళ్లి ఆ విశేషాల్ని గుర్తు చేసుకోవడం నోస్టాల్జిక్‌‌‌‌‌‌‌‌గా ఉందని,  వెంకటేష్‌‌‌‌‌‌‌‌ ఆ పాత్రను ఎంతో ఓన్ చేసుకుని నటించారని త్రివిక్రమ్ అన్నారు. ఈ జనరేషన్‌‌‌‌‌‌‌‌ పిల్లల్ని కూడా ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తున్న ఇలాంటి సినిమాకు నిర్మాత అని చెప్పుకోవడం గౌరవంగా ఉందని రవికిషోర్ చెప్పారు.