గ్రేటర్ వరంగల్/ మరిపెడ, వెలుగు: వరంగల్ జిలాల్లో యాసంగికి సరిపడా యూరియా అందుబాటులో ఉందని వరంగల్ కలెక్టర్ సత్య శారదాదేవి అన్నారు. మంగళవారం కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి 2025-26కి జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 1,12,345 ఎకరాలు నేటి వరకు సాగులో ఉన్నాయని తెలిపారు.
గత యాసంగిలో ఇప్పటికే 12,543 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందించామని, ఈ యాసంగిలో ఇప్పటి వరకు 14,375 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందజేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో డీలర్ల దుకాణాల్లో 434 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, వరంగల్ జిల్లా మార్కెఫెడ్ లో 5700 టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎంపీడీవో ఆఫీస్లో యూరియా యాప్ వినియోగంపై అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందవద్దని, పంటలకు సరిపడా యూరియా ఉన్నదని అన్నారు. యాప్ ద్వారా బుక్ చేసుకున్న తర్వాత యూరియా తీసుకోవాలని సూచించారు.
