ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జంటగా యుగంధర్ ముని దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు కలిసి నిర్మించిన చిత్రం ‘శంబాల’. క్రిస్మస్ రోజున విడుదలైన ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో డివైన్ బ్లాక్ బస్టర్ పేరుతో ప్రెస్ మీట్ నిర్వహించారు.
అతిథిగా హాజరైన అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘ఈ మూవీ చాలా బాగుంది. కొంచెం ఆలస్యమైనా ఆది అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. కొడుకు పైకి రావడంలో తండ్రికి ఉండే ఆనందం నాకంటే ఎవరికి బాగా తెలుస్తుంది. నా కుటుంబంలోని వ్యక్తి సక్సెస్ అయినట్టుగా ఫీలవుతున్నా’ అని అన్నారు.
దర్శకులు వశిష్ట, బాబీ, హీరో సందీప్ కిషన్, రచయిత కోన వెంకట్ ఈ కార్యక్రమంలో పాల్గొని టీమ్‌ను అభినందించారు. చిత్ర యూనిట్‌తోపాటు సాయి కుమార్ కుటుంబ సభ్యులంతా పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.
