అలాంటి నటుడు ఇంకా పుట్టలేదు: ఇమ్మాన్యుల్

అలాంటి నటుడు ఇంకా పుట్టలేదు: ఇమ్మాన్యుల్

‘జబర్దస్త్’ షోతో మంచి ఫేమ్ తెచ్చుకున్న ఇమ్మాన్యుల్.. ఇటీవల ‘బిగ్ బాస్‌‌‌‌‌‌‌‌’లో టాప్ 4 ఫైనలిస్ట్‌‌‌‌‌‌‌‌గా బయటికొచ్చాడు. ఈ సందర్భంగా తాను ‘బిగ్ బాస్’ షో నుంచి చాలా నేర్చుకున్నానని, ఆ అనుభవాలను ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటానని చెప్పాడు. 

‘బిగ్ బాస్’లో ప్రతి ఒక్కరూ నటిస్తారని అందరూ అనుకుంటారని,  కానీ గంటల తరబడి,  వారాల తరబడి, రోజుల తరబడి నటించగలిగే మహానటులు ఇంకా ఈ ప్రపంచంలో ఎవరూ పుట్టలేదని తెలియజేశాడు. ఈ జర్నీలో తనకు సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పాడు.