హైదరాబాద్, వెలుగు:ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతులను పెంచడానికి ఈ–కామర్స్కంపెనీ అమెజాన్ రాష్ట్ర మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఎమ్ఈడీసీ) తో చేతులు కలిపింది. దీనివల్ల స్థానిక ఎంఎస్ఎంఈలు, చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించడానికి వీలవుతుంది.
అమెరికా, బ్రిటన్, యూఏఈ, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్లాట్‌ఫామ్‌లను వాడుకోవచ్చు. విజయవాడలో జరిగిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప–ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. రాష్ట్రంలోని 39 లక్షల ఎంఎస్ఎంఈలకు ఈ ఒప్పందంతో మేలు జరుగుతుంది.
