ఏపీ అసెంబ్లీ : రెండు చోట్లా పవన్..?

ఏపీ అసెంబ్లీ : రెండు చోట్లా పవన్..?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పోటీ చేసిన రెండు చోట్లా మొదటి రెండు రౌండ్లలో వెనుకంజలో ఉండగా.. గాజువాక నియోజకవర్గంలో మూడో రౌండ్ లో లీడ్ లోకి వచ్చారు.  YCP అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై .. పవన్‌ లీడ్ లో ఉన్నారు. భీమవరంలో TDP అభ్యర్థి పులవర్తి రామాంజనేయులు తొలి రౌండ్‌ ముగిసే సరికి పవన్‌కల్యాణ్‌పై 265 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎంపీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు జనసేన లీడ్ లోకి రాలేదు. ఫలితాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా YCP 120కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుండగా.. TDP 30 స్థానాల్లో ముందంజలో ఉంది.