
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుల్ని శాసన మండలి సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో శాసన మండలని రద్దు చేయాలని సీఎం జగన్ భావించారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో శాసన మండలిరద్దు చేస్తూ ప్రవేశ పెట్టే తీర్మానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రారంభమైన బిజినెస్ అఫైర్స్ కమిషన్ (బీఏసీ )
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం జగన్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కన్నబాబు, అనీల్ కుమార్, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. భేటీలో ప్రధానంగా శాసన మండలిని రద్దు చేస్తూ కేబినెట్ చేపట్టిన తీర్మానంపై చర్చకు సమయం కేటాయింపుపై చర్చించనున్నారు.
బీఏసీ తరువాత ప్రారంభ కానున్న అసెంబ్లీ సమావేశాలు
స్పీకర్ అధ్యక్షతన సీఎం జగన్, మంత్రులు బీఏసీ సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశం అనంతరం అసెంబ్లీ ప్రారంభం కానుంది.ఈ అసెంబ్లీ సమావేశాల్లో శాసనమండలి రద్దు తీర్మానం గురించి చర్చించనున్నారు.
స్పీకర్ కు అందిన కేబినెట్ తీర్మానం
శాసన మండలి రద్దు చేస్తూ కేబినెట్ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఆ తీర్మానం కొద్దిసేపటి క్రితం తనకు అందినట్లు స్పీకర్ తమ్మినేని తెలిపారు.