ఏపీ కేబినెట్: రూపాయికే 100 గజాల ఇంటి రిజిస్ట్రేషన్

ఏపీ కేబినెట్: రూపాయికే 100 గజాల ఇంటి రిజిస్ట్రేషన్

ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూపాయికే 100 చదరపు గజాల వరకు ఇంటి స్థలం రిజిస్ట్రేషన్. జనవరిలో అమ్మఒడి పథకం,  కృష్ణ,గోదావరి కాల్వల శుద్ధికి మిషన్ ఏర్పాటు వంటి నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

కేబినెట్ నిర్ణయాలు

  • అమ్మ ఒడికి రూ.15 వేల చొప్పున ఇవ్వడానికి  రూ .6455 కోట్లు కేటాయింపు. తల్లి, లేదా సంరక్షకులకు ప్రతి ఏటా అందిస్తుంది. జనవరి నుంచి ప్రారంభం.
  • 6 సంవత్సరాల లోపు పిల్లలు, గర్భవతులకు పౌష్టిక ఆహారం. 77 మండలాల్లో అందించేందుకు రూ305 కోట్లు
  • కృష్ణ, గోదావరి కాల్వల శుద్ధి మిషన్ ఏర్పాటు. సీఎం చైర్మన్ గా మిషన్ ఏర్పాటు.
  • 130 పంటకాల్వల్లో మురుగునీరు కలుస్తున్న వాటిని గుర్తించి, అక్కడ మురుగుసుద్ది ప్లాంట్ ఏర్పాటు
  • ఎస్సీ కార్పోరేషన్ ను 3 కార్పొరేషన్ లుగా ఏర్పాటు. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ లుగా ఏర్పాటు
  • వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు వైఎస్సార్ ప్రతిభ అవార్డ్ ల ఏర్పాటు.జనవరి 26, ఆగస్టు15న 50 మంది వంతున అవార్డ్, 10 లక్షల నగదు.
  • హజ్, జెరూసలేం యాత్రికులకు సహాయం. 3 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి 60 వేలు, 3 లక్షల పైన ఆదాయం ఉంటే రూ.30 వేలు
  • కంకర నుంచి రోబో సాండ్ తయారు చేసేందుకు ప్రస్తుతం ఉన్న యూనిట్ ల అప్ గ్రేడ్ కు చేసుకునే వారికి 1.5 కోట్ల వరకు పావలా వడ్డీకే రుణాలు.
  • 100 గజాల వరకు ఇంటి రిజిస్ట్రేషన్ రూ.1 .100 నుంచి 300 గజాల వరకు మార్కెట్ విలువ ప్రకారం రెగ్యులైజ్ .
  • గ్రామీణ,వార్డు స్థాయిలో 397 అదనపు జెఎల్ఎం పోస్టుల భర్తీకి ఆమోదం.