ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలి :  కలెక్టర్ హనుమంత  రావు

 ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలి :  కలెక్టర్ హనుమంత  రావు

యాదాద్రి, వెలుగు:  పురోగతి లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంత  రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయిన లబ్ధిదారులకు జాబ్ కార్డులు, ఉపాధి హామీ పధకం, వ్వక్తి గత మరుగుదొడ్లు నిర్మాణపు పనుల పురోగతిపై మండలాల వారీగా  వివరాలను ఆఫీసర్లు వివరించారు.  

కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు జాబ్ కార్డు ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసిన వారు వ్వక్తిగత మరుగుదొడ్లు పూర్తి చేసిన వారికీ రూ. 12 వేలు విడుదల చేయాలని ఆదేశించారు. మీటింగ్​లో అడిషనల్​ కలెక్టర్ భాస్కరరావు, డీఆర్​డీవో నాగిరెడ్డి, ఆర్డీవో కృష్ణా రెడ్డి, హౌసింగ్ పీడీ విజయసింగ్, శ్రీరాములు, ఎంపీడీవోలు, ఏపీఓలు అధికారులు పాల్గొన్నారు.