ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు 

ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు 

నల్గొండ అర్బన్, వెలుగు: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈనెల 25 తేదీ నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.

 జిల్లా వ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు 45  సెంటర్లను ఏర్పాటు చేశామని ఫస్ట్ ఇయర్ కు సంబంధించి 13,115 మంది విద్యార్థులు జనరల్ 11281, ఒకేషనల్ 1834 హాజరుకానుండగా  సెకండ్ ఇయర్ కు సంబంధించి 13,903 జనరల్11, 882, ఒకేషనల్ 2021 ముందు విద్యార్థులు హాజరుకానున్నారు.  

మొత్తం కలిపి 27, 0 18 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.  ఈ పరీక్షల నిర్వహణకు హైపవర్ కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, ఎస్పీ మెంబర్ గా, డీఐఈఓ కన్వీనర్ గా, సీనియర్ ప్రిన్సిపల్ మెంబర్ గా ఉన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ..  జిల్లావ్యాప్తంగా ఈనెల 25వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.