నార్నూర్ లో లైబ్రరీ, ఐటీసీ కేంద్రం ప్రారంభం : కలెక్టర్ రాజర్షిషా

నార్నూర్ లో లైబ్రరీ, ఐటీసీ కేంద్రం ప్రారంభం : కలెక్టర్ రాజర్షిషా
  •     పోటీ పరీక్షలకు లైబ్రరీ ఎంతో ఉపయోగం: కలెక్టర్ రాజర్షిషా

ఇంద్రవెల్లి(నార్నూర్), వెలుగు: యువత, విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్​ కలెక్టర్ రాజర్షిషా సూచించారు. మంగళవారం నార్నూర్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కొత్ లైబ్రరీని జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య,  ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్​తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు లైబ్రరీ ఎంతో ఉపయోగకరమన్నారు. లైబ్రరీలో 
ఇంటర్నెట్​తో కూడిన సిస్టమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. వార్త పత్రికలు, మ్యాగజీన్లను సైతం అందుబాటులో ఉంచాలన్నారు.

మండలంలో ఐటీ స్కిల్ సెంటర్, ఇంగ్లీష్ ఫౌండేషన్ లెర్నింగ్ ప్రోగ్రాం, త్వరలో ట్రైబల్ మ్యూజియం ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం సరస్వతి మహిళా సమైక్య భవనంలో స్వాశోధన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐసీటీ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కంప్యూటర్ ల్యాబ్​ను పరిశీలించి సాంకేతిక శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళ సంఘాలకు సమావేషి ఆజీవిక యోజన పథకం అమలుపై అవగాహన సదస్సు నిర్వహించి సూచనలు చేశారు. ఈ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.

నార్నూర్ మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి 


సంపూర్ణ అభియాన్ 2.0లో భాగంగా నార్నూర్ మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో సంపూర్ణత అభియాన్ 2.0 ప్రారంభించి మాట్లాడారు. సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమాన్ని ఏప్రిల్ 14 వరకు విజయవంతంగా పూర్తిచేయాలన్నారు. మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పనకు అధికారులు కృషి చేయాలన్నారు.

గర్భిణులతోపాటు బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, సర్పంచ్ కావేరి, డీఆర్డీవో రవీందర్, జిల్లా సంక్షేమ అధికారి మిల్క, నీతి ఆయో ప్రోగ్రాం అధికారి రాహుల్, ఎంపీడీవో పుల్లారావు, తహసీల్దార్ రాజలింగు  తదితరులు పాల్గొన్నారు.