యాదగిరిగుట్టలో ముగిసిన శివరాత్రి ఉత్సవాలు

యాదగిరిగుట్టలో ముగిసిన శివరాత్రి ఉత్సవాలు
  • పూర్ణాహుతి, త్రిశూల తీర్థం, శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తి

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మహా శివరాత్రి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి.  కొండపైన ఉన్న శ్రీపర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో  ఆరు రోజులుగా జరుగుతున్న శివరాత్రి ఉత్సవాలు మంగళవారం నిర్వహించిన పూర్ణాహుతి, త్రిశూల తీర్థం, శృంగార డోలోత్సవంతో పరిసమాప్తం అయ్యాయి.  ఈ నెల 12న స్వస్తివాచనం, విష్వక్సేన ఆరాధన, రక్షాబంధనంతో మొదలైన ఉత్సవాలు మంగళవారం నిర్వహించిన పూర్ణాహుతి, త్రిశూల తీర్థం, శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగిశాయి.

ఉత్సవాల్లో భాగంగా శివకల్యాణం కోసం ఆహ్వానించిన సకల దేవతలకు పూర్ణకుంభ ఆరాధనలు జరిపి మహా పూర్ణాహుతి ద్వారా వీడ్కోలు పలికే తంతును ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు.  అనంతరం త్రిశూల తీర్థం ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. కొండపైన ఉన్న విష్ణుపుష్కరిణిలో త్రిశూల స్నానం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. చైర్మన్ నరసింహమూర్తి, ప్రధానార్చకులు గౌరీభట్ల నర్సింహరాములు, ప్రధాన పురోహితుడు సత్యనారాయణ శర్మ,  అర్చకులు నరసింహమూర్తి, శ్రీనివాస్ శర్మ, సాయికృష్ణ పాల్గొన్నారు.