ఏపీలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు

ఏపీలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు

ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.కేబినెట్ విషయాలను మంత్రి పేర్ని నాని మీడియా ముందు వెళ్లడించారు. కేబినెట్ ఆమోదంతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతారు. ప్రజా రవాణా శాఖ ఏర్పాటుకు ఓకే చెప్పింది కేబినెట్.అలాగే ఇసుక అక్రమాలపై కొత్త  మైనింగ్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇసుక టన్ను ధర రూ. 357 గా నిర్ణయించింది. ఏపీఎండీసీ ద్వారా ఇసుకను ఆన్ లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే ఏపీలో సొంతంగా ప్యాసింజర్ ఆటో,కార్లు నడుపుకునే వారికి యేటా రూ.10 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 10 నుంచి అప్లై చేసుకోవచ్చు. ఆశా వర్కర్ల వేతనం రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచింది. వైఎస్సార్ పెళ్లి కానుక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ,ఎస్టీలకు రూ.లక్ష, దివ్యాంగులకు రూ.లక్షన్నర,  మైనార్టీలకు రూ.లక్ష ఇవ్వనుంది.