- సీఎంఏ ఫైనల్ ఫలితాల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు అభినందనలు
హైదరాబాద్, వెలుగు: సీఎంఏ ఫైనల్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన మాస్టర్ మైండ్స్ విద్యార్థిని కొత్తపేట తేజశ్వినిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సన్మానించారు. బుధవారం ఏపీ సెక్రటేరియెట్ లో సీఎం చంద్రబాబును ఆమె కలిశారు. సన్మానించిన తర్వాత సీఎం మాట్లాడారు. రాష్ట్రఖ్యాతిని పెంచినందుకు మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల యాజమాన్యం, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల అడ్మిన్ అడ్వైజర్ సీఏ. మట్టుపల్లి మోహన్ సీఎం సహాయనిధికి రూ.7 లక్షల డీడీని అందించారు. విజయవాడ వరద బాధితులకు సహాయం చేయడానికి ఈ నిధులను ఉపయోగించాలని కోరారు.