విచారణ పూర్తయ్యేవరకు జగన్ రావాల్సిందే

విచారణ పూర్తయ్యేవరకు జగన్ రావాల్సిందే

హైదరాబాద్ : AP  సీఎం జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తదుపరి విచారణ ఈ నెల 17కి వాయిదా పడింది. సీఎం హోదాలో మొదటిసారిగా కోర్టుకు హాజరయ్యారు జగన్. AP సీఎంతో పాటు…వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు అధికారులు కోర్టుకు అటెండ్ అయ్యారు. ఈ కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవ్వాల్సి ఉండగా…..సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బిజీగా ఉన్న జగన్ కోర్టుకు హాజరు కాలేకపోయారు. కోర్టుకు వరుసగా రాకపోవటంతో  కేసు విచారణపై ప్రభావం పడుతుందని సీబీఐ తరపు లాయర్లు అభ్యంతరం తెలిపారు.

సీబీఐ తరపు న్యాయవాదుల వాదనలను విన్న న్యాయస్థానం ….. కోర్టుకు తప్పని సరిగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రతిసారీ మినహాయింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీంతో నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు  సీఎం జగన్. అక్రమాస్తుల కేసులో జగన్ పై 11 ఛార్జ్ షీట్లను సీబీఐ అధికారులు కోర్టులో దాఖలు చేశారు. ప్రతి ఛార్జీషీట్ లో ఏ-1 నిందితుడిగా జగన్ పేరు నమోదు చేశారు. ఇక ఎ-2గా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఉన్నారు.