పోలవరం ప్రాజెక్టు పనులపై ఏపీ సీఎం జగన్ అసంతృప్తి

పోలవరం ప్రాజెక్టు పనులపై ఏపీ సీఎం జగన్ అసంతృప్తి

వెస్ట్ గోదావరి జిల్లా: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సీఎం అయిన తర్వాత మొదటిసారి ఆయన పోలవరం ప్రాజెక్టును విజిట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. కాఫర్ డ్యాం, టెక్నికల్ అంశాలపై వివరాలు తెల్సకున్నారు. ఐతే.. కాఫర్ డ్యాం పనుల ఆలస్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేసినట్టు సమాచారం. భారీగా వరదొస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించినట్టు తెలిసింది.