నీటి విషయంలో రాజీపడం

నీటి విషయంలో రాజీపడం

త్వరలోనే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పనులు చేపడతాం
ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ఏపీ సీఎం జగన్

అమరావతి, వెలుగు: ‘రాష్ట్రానికి సంబంధించిన నీటి ప్రయోజనాల విషయంలో రాజీపడం, త్వరలో రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పనులు స్టార్ట్ చేస్తాం’ అని ఏపీ సీఎం జగన్ అన్నారు. 2022 ఖరీఫ్‌కు పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. శనివారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు సమన్యాయం చేసేందుకే వికేంద్రీకరణ చేపట్టామన్నారు. మూడు రాజధానుల బిల్లును చట్టంగా మార్చామని చెప్పారు. త్వరలో వైజాగ్ కేంద్రంగా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, కర్నూలు కేంద్రంగా జ్యుడీషియల్ క్యాపిటల్ ఏర్పాటుకు పునాదులు వేస్తామని తెలిపారు. పార్లమెంటులో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదాను అమలు చేయాలని అడుగుతూనే ఉంటామన్నారు. రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ వర్తింపజేశామని చెప్పారు. 14 నెలల పాలనలో వివిధ స్కీముల ద్వారా దాదాపు రూ.46వేల కోట్లు ప్రజలకు నేరుగా అందించామని తెలిపారు.

For More News..

ఎన్జీటీ తీర్పు ఇచ్చే టైమ్లో.. సర్కార్ మేల్కొంది