కాల్ మనీతో సంబంధమున్న ఎవ్వరినీ వదలొద్దు: జగన్

కాల్ మనీతో సంబంధమున్న ఎవ్వరినీ వదలొద్దు: జగన్

అమరావతి: కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ అంశంపై జగన్ సీరియస్‌ అయ్యారు. ఈ రోజు కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ.. విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మహిళలను కాల్‌మనీ పేరిట వేధించారన్నారు. అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి, తిరిగి కట్టనందుకు వారిని సెక్స్‌రాకెట్‌లోకి దించి, వీడియోలను చిత్రీకరించి మహిళల పట్ల పైశాచికంగా వ్యవహరించారన్నారు.

అంత జరిగినా.. ఆ ఘటనపై ఎలాంటి కేసులు రాలేదని, ఎవ్వరిని అరెస్టు చేయలేదని జగన్ అన్నారు.
మనం సరైన పాలన చేస్తున్నట్టేనా అని గత పాలకులని ప్రశ్నించారు. నంబర్‌ ఒన్‌ పోలీసింగ్‌ చేస్తున్నట్టేనా? అని అడిగారు.

కాల్ మనీ అంశంపై ఎవరికైనా ఫిర్యాదు ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు. ఈ కేసుకు సంబంధమున్న ఏ పార్టీ వారిని విడిచిపెట్టొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కూడా ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని  కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.