YSR ఆరోగ్య ఆసరా ప్రోత్సాహకం పెంపు: సీఎం జగన్

 YSR ఆరోగ్య ఆసరా ప్రోత్సాహకం పెంపు: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.YSR ఆరోగ్య ఆసరా కింద ప్రభుత్వం అందించే ప్రోత్సహాకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్. సాధారణ ప్రసవానికి ప్రస్తుతం ఇస్తున్న రూ.3వేల ప్రోత్సాహకాన్ని రూ.5 వేలకు పెంచారు. ఇక సిజేరియన్ ప్రసవానికి సంబంధించి ప్రోత్సాహకాన్ని రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంచారు. దీనికి సంబంధించి శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్.  ఆస్పత్రుల సేవలు అధ్వాన్నంగా ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని, రెండు వారాల్లో పరిస్థితి మెరుగు పడాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో అన్నీ నిబంధనలు పాటించాలని… 6 నెలల తర్వాత పరిస్థితులు మెరుగుపడకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాల్లో ఆరోగ్య శ్రీ కో ఆర్డినేషన్ బాధ్యతలు ఇక నుంచి జేసీలకి అప్పజెప్పాలని సూచించారు సీఎం జగన్.

గతవారమే  YSR ఆసరా పథకాన్ని ప్రారంభించారు సీఎం జగన్.