Kannappa Box Office: కన్నప్పకు భారీ నష్టాలు తప్పవా?.. 4 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు ఎంతంటే?

Kannappa Box Office: కన్నప్పకు భారీ నష్టాలు తప్పవా?.. 4 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు ఎంతంటే?

కన్నప్ప వసూళ్లు బాక్సాఫీస్ దగ్గర తగ్గుముఖం పడుతున్నాయి. మంచు విష్ణుకు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందించినప్పటికీ.. కన్నప్ప నిర్మాణ స్థాయికి, నటించిన నటుల లెవల్ను బట్టి చూస్తే కలెక్షన్లు మాత్రం తక్కువే వస్తున్నాయి. క్రమంగా రోజు రోజుకూ తగ్గుతూ బ్రేక్ ఈవెన్ చేరుకోవడంలో కన్నప్ప ఇబ్బంది పడుతుంది.  

తొలిమూడ్రోజుల్లో ఇండియా వైడ్గా రూ.22.53 కోట్లు నెట్, ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక నాలుగోరోజైన సోమవారం (జూన్ 30న) మాత్రం అదే ఊపును కొనసాగించడంలో విఫలమైంది. సోమవారం రూ.2.50 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇండియాలో తొలి నాలుగు రోజుల్లో రూ.25.90 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.31.5 కోట్ల నెట్ వసూలు చేసింది.

ట్రాకింగ్ వెబ్‌సైట్ సాక్నిల్క్ ప్రకారం , ఈ చిత్రం శుక్రవారం, శనివారం మరియు ఆదివారం నాడు రూ.5-10 కోట్ల మధ్య నెట్ వసూలు చేసింది. 4వ రోజు (సోమవారం) ఈ మూవీ రూ. 2.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇది గడిచిన రోజుల వసూళ్ల కంటే 50 శాతం కంటే ఎక్కువ తగ్గుదల అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

రోజు వారీగా కన్నప్ప నెట్ కలెక్షన్లు:

మొదటి రోజు (జూన్27): రూ. 9.35 కోట్లు

2వ రోజు: రూ. 7.15 కోట్లు

3వ రోజు: రూ. 6.9 కోట్లు

4వ రోజు: రూ. 2.50 కోట్లు

మొత్తం: రూ. 25.90 కోట్లు(నెట్)

కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా రూ.31.5కోట్లు నెట్, రూ.50 కోట్లకి పైగా గ్రాస్ సాధించింది. ఇండియాలో చూసుకుంటే గ్రాస్ 27.5 కోట్లు కాగా.. నెట్ వసూళ్లు రూ.25.90 కోట్లుగా ఉంది. ఓవర్సీస్లో రూ.4కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

అయితే, కన్నప్ప చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి, విమర్శకులు నుంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ.. వసూళ్లలో మాత్రం దూకుడు చూపించలేకపోతుంది. ఇక ఈ వారం కనుక వసూళ్లను రాబట్టలేకపోతే.. కన్నప్పను భారీ నష్టాలూ తప్పేలా లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సుమారు రూ.200కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన కన్నప్ప మూవీకి.. బ్రేక్ ఈవెన్ రావాలంటే.. వరల్డ్ వైడ్ గా గ్రాస్ కనీసం రూ.180 కోట్లు రాబట్టాలని టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కలు చూస్తుంటే.. కన్నప్ప గట్టెక్కుతుందా? లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.