ఫేక్ లా సర్టిఫికెట్లతో అడ్వకేట్లుగా ఎన్‌‌‌‌రోల్.. 9 మందిని తొలగించిన స్టేట్‌‌‌‌ బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌

ఫేక్ లా సర్టిఫికెట్లతో అడ్వకేట్లుగా ఎన్‌‌‌‌రోల్.. 9 మందిని తొలగించిన స్టేట్‌‌‌‌ బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఫేక్ లా సర్టిఫికెట్లతో న్యాయవాదులుగా ఎన్‌‌‌‌రోల్‌‌‌‌ అయిన తొమ్మిది మందిని తొలగిస్తూ స్టేట్‌‌‌‌ బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కౌన్సిల్‌‌‌‌ సెక్రటరీ మంగళవారం (జూన్ 02) ఓ ప్రకటన విడుదల చేశారు.

 తొలగించిన వారిలో అజర్ శ్రావణ్ కుమార్ (టీఎస్‌‌‌‌/1359/2008), ఎం.సురేఖా రమణి (టీఎస్‌‌‌‌/1206/2014), ఎన్.విద్యా సాగర్ (టీఎస్‌‌‌‌/2892/2016), పి.సిసిల్ లివింగ్స్టన్ (టీఎస్‌‌‌‌/2896/2016), సతీష్ కనకట్ల (టీఎస్‌‌‌‌/728/2017), నరేష్ సుంకర (టీఎస్‌‌‌‌/1214/2017), రాజశేఖర్ చిలక (టీఎస్‌‌‌‌/1354/2019), శ్రీశైలం.కె (టీఎస్‌‌‌‌/1565/2019), ఎ.ఉదయ్ కిరణ్ (టీఎస్‌‌‌‌/3626/2018) ఉన్నారు.