పెండ్లి బంధంలోకి టెన్నిస్ లెజెండ్ వీనస్ విలియమ్స్

పెండ్లి బంధంలోకి టెన్నిస్ లెజెండ్ వీనస్ విలియమ్స్

పామ్ బీచ్ (ఫ్లోరిడా):  అమెరికా టెన్నిస్ లెజెండ్, ఏడుసార్లు గ్రాండ్‌‌‌‌స్లామ్ సింగిల్స్ చాంపియన్ వీనస్ విలియమ్స్  వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. డెన్మార్క్‌‌‌‌లో జన్మించిన ఇటాలియన్ మోడల్, యాక్టర్ ఆండ్రియా ప్రేతీని ఆమె పెండ్లి చేసుకుంది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌‌‌‌లో ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన వేడుకల్లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. మంగళవారం సోషల్ మీడియా వేదికగా వీనస్ తన పెండ్లి విషయాన్ని వెల్లడించింది.