
మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో తహసీల్దార్లతో మీటింగ్ నిర్వహించారు. వరద ప్రవాహం, కొత్త రేషన్ కార్డుల జారీ, నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సేకరణ ఎంతవరకు వచ్చిందని అడిగారు.
వానాకాలం నేపథ్యంలో కృష్ణా నదీ తీర ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులందరికీ కార్డులు వచ్చేలా చూడాలని పేర్కొన్నారు. అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, ఆర్డీవో రామచందర్ నాయక్ ఉన్నారు.