
- యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత గుండె వైద్య శిబిరం
చేర్యాల, వెలుగు: ఆగిపోయే ఊపిరిని నిలిపే ప్రత్యక్ష దైవాలు డాక్టర్లని చేర్యాల సీఐ ఎల్. శ్రీను అన్నారు. మంగళవారం చేర్యాల పట్టణంలో సీడీఏ (చేర్యాల డాక్టర్స్ అసోసియేషన్) ఆధ్వర్యంలో డాక్టర్స్ డే పురస్కరించుకొని యశోద హాస్పిటల్ సౌజన్యంతో అక్షర ఆసుపత్రిలో ఉచిత గుండె వైద్య శిబిరాన్నిఏర్పాటు చేశారు. అంతకు ముందు చేర్యాల గాంధీ సెంటర్ నుంచి విద్యార్థులు, పట్టణ ప్రజలు నాయకులతో డాక్టర్లు హనుమాన్ టెంపుల్ వరకు సే నో టు డ్రగ్స్భారీ ర్యాలీ నిర్వహించారు.
టెంపుల్వద్ద మానవహారంగా ఏర్పడి డాక్టర్స్అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు డ్రగ్స్‌కు బానిసై తమ విలువైన జీవితాలను ఆగంచేసుకోవద్దని సూచించారు. రోజులో ఒక గంట వ్యాయామం, నడక 23 గంటలు కాపాడుతుందన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా గ్రౌండ్లో నడకను అలవాటు చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఎస్సై నీరేశ్, ఎంఈఓ రచ్చ కిష్టయ్య, ప్రొహిబిషనరీ ఎస్సై సమత, యశోద హస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్, చేర్యాల డాక్టర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ఆర్. పరమేశ్వర్, ఉపాధ్యక్షుడు ఏడెల్లి సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి తుంగ రఘునందన్ రాణా, బాలకిషన్, సతీశ్, మేక శ్రీకాంత్, స్థానిక నాయకులు పి.ఆగంరెడ్డి కళావతి, అందె నానిబాబు, శ్రీధర్‌రెడ్డి, శ్రీధర్, అందె అశోక్, యం. నాగేశ్వర్రావు, పి. వెంకట్‌రెడ్డి, పి. లక్ష్మీనారాయణ, డి. శ్రీకాంత్, బి. సత్యనారాయణ, సదానందం, శ్రీకాంత్, జహూరుద్దీన్, రామాంజనేయులు పాల్గొన్నారు.