షీ టీంతో మహిళలకు భద్రత, భరోసా : సీపీ.డాక్టర్ బి.అనురాధ

 షీ టీంతో మహిళలకు భద్రత, భరోసా : సీపీ.డాక్టర్ బి.అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు: మహిళలకు, పిల్లలకు భద్రతా, భరోసా కల్పించడం షీటీమ్  ముఖ్య ఉద్దేశమని సీపీ. డాక్టర్ బి.అనురాధ అన్నారు. మహిళల రక్షణ కో సంఉన్న చట్టాలను తెలపడానికి స్కూల్స్, కాలేజీలతో పాటు, గ్రామాల్లో, మహిళలు పనిచేస్తున్న ప్రదేశానికి వెళ్లి జిల్లా షీటీమ్ బృందాలు అవగాహన కల్పిస్తున్నాయన్నారు.

 మహిళలు మౌనం వీడితే విజయం సాధించినట్లేనని, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ ఏదైనా అవమానానికి గురయినట్లయితే వెంటనే జిల్లా షీటీమ్ వాట్సాప్ నెంబర్ 8712667434 కు గాని, సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్  8712667100 నెంబర్ కు కాల్ చేయాలన్నారు. జిల్లాలోని హాట్‌‌ స్పాట్ వద్ద  షీటీమ్స్ తో నిరంతరం నిఘా ఉంచుతున్నట్లు తెలిపారు. పొక్సో, లైంగిక వేధింపులకు గురైన మహిళలకు, బాలికలకు భరోసా సెంటర్ భరోసానిస్తుందన్నారు.  భరోసా సెంటర్ సేవల కోసం 08457- 293098 నెంబర్ కు ఫోన్ చేసి సహాయ సహకారాలు పొందవచ్చని సూచించారు