విశాఖకు ఆణిముత్యంగా ఇనార్బిట్‌ మాల్‌.. 8 వేల ఉద్యోగాలకు శ్రీకారం

విశాఖకు ఆణిముత్యంగా ఇనార్బిట్‌ మాల్‌..  8 వేల ఉద్యోగాలకు శ్రీకారం

 విశాఖపట్నంలో  అతిపెద్ద ఇనార్బిట్‌ మాల్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి భూమి పూజ చేశారురూ. 600 కోట్లతో 17 ఎకరాల స్థలంలో ఇనార్బిట్‌ మాల్‌ను నిర్మించేందుకు సిద్ధమైంది కె.రహేజా గ్రూపు.. మొత్తం 17 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మూడు దశల్లో ఇనార్బిట్‌ మాల్‌ విస్తరణ చేయనున్నారు.. . ఈ మాల్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.  దీనికి అదనంగా పార్కింగ్‌ కోసం ఏకంగా నాలుగు లక్షల చదరపు అడుగులను అభివృద్ధి చేసేలా ప్లాన్‌ సిద్ధం చేశారు.   2026 నాటికి ఇనార్బిట్‌ మాల్‌ను అందుబాటులోకి తేవాలని టార్గెట్‌గా పెట్టుకుంది రహేజా గ్రూపు.. 250కిపైగా అంతర్జాతీయ బ్రాండ్లకు ఈ మాల్‌ వేదిక కానుండగా.. కాగా, మాల్‌ నిర్మాణం కోసం పోర్టు అథారిటీకి చెందిన 17 ఎకరాలను 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. రెండో దశలో ఐటీ క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తారు. 3,000 మంది పనిచేసే విధంగా సుమారు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను 2027 నాటికి అందుబాటులోకి తెస్తారు. మూడో దశలో ఫోర్‌ స్టార్‌ లేదా ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను 200 గదులు, బాంకెట్‌ హాళ్లతో నిర్మిస్తారు. పూర్తి పర్యావరణహితంగా భవనాన్ని నిర్మిస్తామని రహేజా గ్రూపు చెబుతోంది.