ఏపీ సీఎం ప్రయాణిస్తున్న ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

 ఏపీ సీఎం ప్రయాణిస్తున్న ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. కొద్దిసేపటి క్రితం గన్నవరం నుంచి ఢిల్లీ బయలుదేరారు. అయితే ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులో సాంకేతిక లోపం తలెత్తినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే విమానాన్ని గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. సీఎం జగన్ క్షేమంగా ఉన్నారని తెలపడంతో వైస్సార్ కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. 

మంగళవారం ఏపీ సీఎం జగర్ ఢిల్లీలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో దౌత్యవేత్తలతో ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం 5.03 గంటలకు గన్నవరం నుంచి ఢిల్లీకి సీఎం జగన్ బయలుదేరారు. అయితే టేకాఫ్ అయిన 23 నిమిషాలకే మళ్లీ ఫ్లైట్ గన్నవరం ఎయిర పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలెట్ గుర్తించడంతో తిరిగి విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లాల్సిన సీఎం జగన్..ప్రస్తుతం గన్నవరం ఎయిర్ పోర్టు లాంజ్లో వేచి చూస్తున్నారు.