
ఏపీ సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు. ముగ్గరు భార్యలున్న పవన్ తమ కొడుకులను, కూతుళ్లను ఏ మీడియంలో చవివిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతోత్సవాల్లో భాగంగా జగన్ మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి అన్నీ ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశపెడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇంగ్లీష్ మీడియంపై జీవో విడుదల చేసిన మరుక్షణమే మాజీ సీఎం చంద్రబాబు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు విమర్శించారని అన్నారు. పేదవాళ్లకు ఇంగ్లీష్ మీడియం అవసరమా అని ప్రశ్నించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కొడుకును, తన మనవణ్ని ఏ మీడియంలో చదవించారన్నారు. వెంకయ్యనాయుడు తన కొడుకును, మనవరాళ్లను ఏమీడియంలో చదివిస్తున్నారన్న జగన్ ..ముగ్గురు భార్యలున్న పవన్ తన కొడుకులు, కూతుళ్లను ఏ మీడియంలో చదవిస్తున్నారో చెప్పాలని జగన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ మీడియం చాలా అవసరమని, ఇంగ్లీష్ వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు.