ఏపీలో ఇవాళ 10,310 కేసులు.. మరణాలు..9

ఏపీలో ఇవాళ  10,310 కేసులు.. మరణాలు..9

 


అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో  10,310 కొత్త కేసులు నమోదు కాగా.. 9 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 39,296 మందికి పరీక్షలు చేయగా.. 10,310 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగుల్లో 9 మంది చనిపోయారని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. విశాఖపట్టణం జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. కొత్త కేసుల్లో కడప జిల్లాలో అత్యధికంగా 1697 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 99 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నమోదైన కొత్త కేసుల వివరాలు కింద పట్టికలో చూడండి... 


 

 

ఇవి కూడా చదవండి

బాలీవుడ్ అందాల తార  కాజోల్కు కరోనా

సబర్మతిలో గాంధీ పెయింటింగ్ ఆవిష్కరించిన అమిత్షా

మన టెకీలకు అమెరికా గుడ్ న్యూస్

నందమూరి బాలకృష్ణ కనబడడం లేదని ఫిర్యాదు