
ముంబయి: బాలీవుడ్ అందాల తార కాజోల్ కరోనా బారినపడ్డారు. సామాన్యులు, రాజకీయ నేతలు మినహా వీఐపీలు కరోనా సోకకుండా వీఐపీలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా మహమ్మారి అంటుకుంటోంది. తాజాగా అలనాటి హీరోయిన్ కాజోల్ కరోనా సోకడంతో హోం ఐసొలేషన్ పాటిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆమె ఇన్ స్టా వేదికగా ప్రకటించారు. తన ఫోటోను ముఖ్యంగా తన ముక్కును చూపించలేనంటూ.. తన కుమార్తె నైసా దేవగణ్ నవ్వుతున్న ఫోటోను పోస్ట్ చేశారు. కాజోల్ 1999లో అజయ్ దేవగణ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాజోల్ - అజయ్ దేవగణ్ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత చేతి నిండా సినిమాలతో బిజిబిజీగా ఉన్న అజయ్ దేవగణ్.. వాటి విడుదల సందర్భంగా ప్రమోషన్ పనుల్లో తలమునకలై ఉన్న పరిస్థితుల్లో ఆయన సతీమణి కాజోల్ కరోనా బారినపడ్డారు.
ఇవి కూడా చదవండి
సబర్మతిలో గాంధీ పెయింటింగ్ ఆవిష్కరించిన అమిత్షా
మన టెకీలకు అమెరికా గుడ్ న్యూస్
ఐదు రాష్ట్రాల ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
నందమూరి బాలకృష్ణ కనబడడం లేదని ఫిర్యాదు