
ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని నెల్లూరు పోలీసులు బెంగళూరులో ఈరోజు ( మే 25) అరెస్ట్ చేశారు. అక్రమ మైన్స్ కేసులో ఎ 4 గా... ఇంకా నెల్లూరులో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. రేపు ఉదయం ( మే 26) నెల్లూరుకు తరలించనున్నారు. కాకాణికి సుప్రీంకోర్ట్ ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో ఆయన్న అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు కాకాణి పట్టుబడటంతో అదుపులోకి తీసుకున్నారు.
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో కాకాణి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిబ్రవరిలో ఆయనపై కేసు నమోదు అయింది.అక్రమ మైనింగ్ కేసులో కాకిణి గోవర్ధన్ రెడ్డి కి విచారణకు రావాలని పోలీసులు అనేకసార్లు నోటీసులు జారీ చేశారు. కాని ఆయన విచారణకు రాకుండా తప్పించుకున్నారు. తనపై నమోదైన కేసుల్లో అరెస్ట్ కాకుండా ఉండేందుకు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యున్నత న్యాయస్థానం కాకాణి బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో ఆయన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రెండు నెలల నుంచి పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. కాకాణి బెంగళూరులో ఉన్నారని గుర్తించిన నెల్లూరు పోలీసులు అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.