టెన్త్ ఎగ్జామ్ పేపర్ లీక్.. పోలీసుల అదుపులో నారాయణ

టెన్త్ ఎగ్జామ్ పేపర్ లీక్.. పోలీసుల అదుపులో నారాయణ

ఏపీలో టెన్త్‌ ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారంలో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొండాపూర్‌లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం ఆయ‌న‌ను అదుపులోకి తీసుకుని ఏపీకి త‌ర‌లించినట్లు సమాచారం. 4 రోజులుగా ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి నారాయణ అజ్ఞాతంలో ఉన్నారని సమాచారం. టెన్త్ పేపర్ లీకేజీలో నారాయణ స్కూల్స్ సిబ్బంది పాత్ర ఉందని అనుమానిస్తున్నారు అధికారులు. తిరుపతిలోని నారాయణ ఎస్వీ బ్రాంచీలో తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. తెలుగు పరీక్ష ప్రారంభమైన తర్వాత ఉదయం 9 గంటల 57 నిమిషాలకు వాట్సాప్ లో క్వశ్చన్ పేపర్ బయటకొచ్చినట్లు తెలుస్తుంది.

నారాయణ పాఠశాలకు చెందిన గిరిధర్ వాట్సాప్ నుంచి తెలుగు ప్రశ్నాపత్రాల లీక్ కావడంతో నారాయణ స్కూల్స్ కు క్వశ్చన్ లీకేజీతో సంబంధం ఉందనే ఆరోపణలతో నారయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్ప‌టికీ గిరిధ‌ర్‌తో పాటు మ‌రొక‌రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రశ్నాపత్రాల పేపర్ లీక్ లో నారాయణ పాత్ర ఉందని ఇటీవల ఓ సభలో సీఎం జగన్ ఓపెన్ గానే ఆరోపణలు చేశారు . టీడీపీవాళ్లే లీకులు చేయించి ప్రభుత్వంపై నెడుతున్నారన్నారు. 

గాలికి బ్రిడ్జ్ ఎలా కూలుతుందో నాకు అర్థం కావట్లేదు

ఢిల్లీ న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఆక్రమణల తొలిగింపు