పెన్షనర్లకు షాక్: సచివాలయాల దగ్గరే పెన్షన్ పంపిణీ

పెన్షనర్లకు షాక్: సచివాలయాల దగ్గరే పెన్షన్ పంపిణీ

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రం రాజకీయ రణరంగంగా మారింది. అధికార ప్రతిపక్షాలు పరచారాన్ని ముమ్మరం చేసి జనాల్లో తిరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రలో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. ఇదిలా ఉండగా వాలంటీర్ల ద్వారా పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాల పంపిణీపై విపక్షాలు చేసిన ఫిర్యాదుతో వాలంటీర్ల సేవలు రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవటం రాజకీయ దుమారాన్ని రేపింది. పేదలకు ప్రభుత్వ పధకాలు అందటం ఇష్టం లేకే ప్రతిపక్షాలు ఈ కుట్ర చేస్తున్నాయని అధికార వైసీపీ ఆరోపిస్తుండగా పెన్షన్ల పంపిణీకి నిధులు సమకూరక ప్రభుత్వం ఈ డ్రామా ఆడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పెన్షన్లు వృద్దులు వికలాంగులకు ఇంటివద్దకే పెన్షన్లు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల పంపిణీ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలన్న ఈసీ ఆదేశాలతో సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది జగన్ సర్కార్. పంపిణీ కేంద్రాల వద్దకు రాలేని వృద్దులు, వికలాంగులకు సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందజేస్తారని తెలిపింది.

ALSO READ :- కేటీఆర్ ట్వీట్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కౌంటర్